అంగారక గ్రహంపై విస్తారమైన భూగర్భ జలాశయాన్ని పరిశోధకులు గుర్తించారు. నాసాకు చెందిన ఇన్సైట్ మిషన్ డేటా ఆధారంగా ఈ అద్భుతాన్ని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

ఈ నీరు మహాసముద్రాలను సృష్టించగలదని తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ ప్రచురించబడిన అధ్యయనం.. మార్స్ క్రస్ట్లోని చిన్న పగుళ్లు, రంధ్రాలలో చిక్కుకున్న నీరు గ్రహాన్ని 1.6 కిలోమీటర్లు లోతు వరకు కవర్ చేయగలదని వెల్లడించింది.