వర్షాకాలంలో లభించే బోడకాకర కాయ (కంటోలా) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బోడకాకరకాయని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందంటున్నారు నిపుణులు.

ఇవి తినడం వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం, ఇతర కడుపు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కూరగాయ ముఖ్యంగా రక్తపోటుతో బాధపడేవారికి చాలా ఉపయోగకరం. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.