ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపైకి నీరు చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
కాగా రానున్న 24 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాతో వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.