న్యాయ ప్రక్రియ మరింత సజావుగా నిర్వహించేందుకు, ప్రభావవంతంగా ఉండేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్స్ అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై సమన్లు, వారెంట్లను వాట్సాప్, ఈ-మెయిల్, టెక్స్ట్ మెస్సేజెస్ ద్వారా పంపనున్నారు.

ఆన్లైన్, ఇతర మాధ్యమాల ద్వారా సమన్లు, వారెంట్లు జారీ చేస్తున్న తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.