ఏపీలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, సంస్థలపై నేరుగా సీబీఐ విచారణ జరపనుంది.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. కాగా, 2014-19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు అనుమతి నిరాకరించింది.