రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా బుధవారం కూడా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. అలాగే ఏలూరు జిల్లా పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో, బాపట్ల జిల్లా భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లోని స్కూళ్లకు సెలవు ఇచ్చారు. మిగతా చోట్ల యథావిధిగా స్కూళ్లు నడవనున్నాయి.