హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆన్ఆద్మీపార్టీ(ఆప్)-కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయడంపై సంప్రదింపులు జరుపుతున్నాయి.

BJPను ఓడించే లక్ష్య సాధనలో భాగంగా విపక్షాల ఓట్లలో చీలిక ఉండరాదని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తం 90అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ఆప్ 10 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తూ ఆ మేరకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. ఏడు సీట్లు ఇచ్చేందుకు మాత్రమే కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.