రైళ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు స్విగ్గీలో ఆహారం బుక్ చేసుకోవడంలో దేశంలోనే విజయవాడ రైల్వేస్టేషన్ అగ్రస్థానంలో ఉందని ఆ సంస్థ ఫుడ్ డెలివరీ విభాగం CEO రోహిత్ కపూర్ తెలిపారు.

విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి సగటున రోజుకు 100 ఆర్డర్లు వస్తున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లోనూ అధిక సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు’ అని వెల్లడించారు.