CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v80), quality = 82?

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా అంపూర్‌ లోని చెన్నై – బెంగళూరు జాతీయ రహదారిపై నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 2023 నుంచి 4 కిలోమీటర్ల మేర హైలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది.

బస్ స్టేషన్ – రైల్వే స్టేషన్ మధ్య అత్యంత సమీప ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ పనులు ఇప్పటికే 60 శాతం పూర్తయ్యాయి. ఈ ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో ఉత్తరాది రాష్ట్రాలకి చెందిన 200 మందికి పైగా కూలీలు రోజూ పనిచేస్తుండగా, శనివారం (ప్టెంబర్ 21) ఒక్కసారిగా ఫ్లైఓవర్‌కు ఒకవైపు నిర్మించిన ఇనుప నిర్మాణం 20 మీటర్ల దూరంలో కూలిపోయింది.

ఈ ఘటనలో ఫ్లైఓవర్‌పై పనిచేస్తున్న బీహార్‌, జార్ఖండ్‌కు చెందిన ఆరుగురు యువకులు తీవ్రంగా గాయపడగా స్థానికులు వారిని రక్షించి చికిత్స నిమిత్తం అంబూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

దీంతో ఫ్లైఓవర్ పనులు తాత్కాలికంగా నిలిచిపోగా, అంబూర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అంబూర్ సిటీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌ను తొలగించి, కేసు నమోదు చేసి ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఘటనా స్థలాన్ని అంబూర్‌ జిల్లా కమిషనర్‌ రేవతి, దేవాదాయ శాఖ అధికారులు సందర్శించి ప్రమాదంపై విచారణ చేపట్టారు.