ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన మెరుపు! ఎన్ని కిలోమీటర్లు తెలుసా…?

ప్రపంచంలోనే అతి పొడవైన మెరుపుగా కొత్త రికార్డు నమోదైంది. అక్టోబర్ 22, 2017న అమెరికాలోని టెక్సాస్, కన్సాస్ మధ్య ఏర్పడిన మెరుపు 829 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచ రికార్డు సృష్టించింది.

ఈ మెరుపు ఒకేసారి టెక్సాస్, ఒక్లహోమా, అర్కాన్సాస్, కన్సాస్, మిస్సోరి రాష్ట్రాలను కవర్ చేసినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ ధ్రువీకరించింది. ఉపగ్రహాల ద్వారా సేకరించిన డేటాను పునఃపరిశీలించడం ద్వారా ఈ కొత్త రికార్డును గుర్తించారు.