మంచిర్యాల జిల్లా,
మందమర్రి,
తేదీ: 11 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మందమర్రి: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, సోమవారం మందమర్రి పట్టణంలోని మహాత్మా గాంధీ జ్యోతిబా ఫూలే బాలికల పాఠశాలలో “షీ టీమ్” ఆవశ్యకతపై విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మందమర్రి ఎస్ఐ రాజశేఖర్,మంచిర్యాల షీ టీం ఎస్ఐ ఉష ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంచిర్యాల షీ టీం ఎస్ఐ ఉష మాట్లాడుతూ…
మహిళలు, యువతులు, విద్యార్థినులను వేధింపుల నుండి రక్షించేందుకే షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బస్టాపులు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో ఉంటూ ఆకతాయిల ఆగడాలను అరికట్టడమే షీ టీమ్స్ ముఖ్య ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా, వెంటనే డయల్ 100 లేదా షీ టీమ్ వాట్సాప్ నెంబర్ ద్వారా సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని ఆమె భరోసా ఇచ్చారు.
అనంతరం మందమర్రి ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ, విద్యార్థినులు ఆత్మ విశ్వాసంతో చదువుపై దృష్టి సారించాలని, వారి రక్షణ బాధ్యతను పోలీసులు తీసుకుంటారని అన్నారు. ఆపద సమయంలో నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని, షీ టీమ్ సేవలను సద్వినియోగం చేసుకొని ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, మందమర్రి పోలీస్ సిబ్బంది, మరియు విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
