గూగుల్ రూపొందించిన జెమిని ఏఐ మోడల్… ప్రధాని మోదీ, ట్రంప్, జెలెన్స్కీ గురించి వేసిన ఒకే ప్రశ్నకు వివిధ సమాధానాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

మోదీని కించపరిచేలా జవాబు ఇచ్చి, మిగిలిన ఇద్దరి విషయంలో ఆన్సర్ కు దాటవేసింది. అది వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో గూగుల్ భారత్ కు క్షమాపణలు చెప్పిందని కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. తమ ఏఐ మోడల్ నమ్మదగినది కాదని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.