మాజీ మంత్రి, ప్రముఖ సినీనటుడు బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేశారు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన ఆయన కేఏ పాల్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఆయన ప్రజాశాంతి పార్టీ తరఫున వరంగల్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2014లో ఆందోల్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న బాబు మోహన్ 2018లో బీజేపీలో చేరారు. 2018, 23లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.