వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో వచ్చే నెల 16 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

17న శ్రీరామనవమి రోజున ధ్వజారోహణం, 22న సీతారాముల కళ్యాణం జరుగుతుందని తెలిపింది. అన్నప్రసాదాలు, తలంబ్రాల పంపిణీకి 2 వేల మంది సేవకులను సిద్ధం చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు నిర్మించాలని సూచించారు.