ఆంధ్రప్రదేశ్ మంత్రులు తమ శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్ తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై అధికారులతో రివ్యూ చేశారు.

రాష్ట్రంలో త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకొస్తామని లోకేశ్ ప్రకటించారు. విశాఖపట్టణాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దుతామని, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు.