బాన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు.

బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలను కేటీఆర్ కలిసిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు. పోచారంను అన్ని రకాలుగా గౌరవించినప్పటికీ పార్టీని వీడడం ఆయనకే నష్టమని తెలిపారు.