ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. జనసేన – టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.

దీంతో ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కనిపించనున్నారు. అంతకుముందే ప్రధాని విశాఖలో పర్యటించాల్సి ఉండగా.. వాయిదా పడినట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. మరో తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపాయి.