దేశంలో 2023 అక్టోబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఏడాది కాలంలో జరిగిన సైబర్ దాడులపై DSCI, సెకైట్ నివేదిక రూపొందించాయి.

దేశవ్యాప్తంగా 84లక్షల ఎండ్పాయింట్ల (నేరం జరిగినట్లు గుర్తించిన కేంద్రం)లో 36.9కోట్ల మాల్వేర్లతో దాడులు జరిగినట్లు గుర్తించారు. దీని ఆధారంగా భారత్ లో నిమిషానికి సగటున 702సైబర్ దాడులు జరిగినట్లు తేల్చారు. అంటే ప్రతి సెకనుకు 11 దాడులు జరిగినట్లు వెల్లడించారు.