మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:29 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

ఎంసీపీఐయు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంసిపిఐ యు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ…

బెల్లంపల్లి లో ఏరియా హాస్పిటల్ నుండి మొదలుకుంటే కొత్త బస్టాండ్ వరకు రోడ్డు గుంతలతో బెల్లంపల్లిలోని ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే ఇదే తంతు కొనసాగుతుందని సంవత్సర కాలంలో మూడు నెలలు మాత్రమే రోడ్డు సక్రమంగా ఉంటుందని తాత్కాలికంగా మట్టి పోసి నింపడమే తప్ప రోడ్డుకు శాశ్వత పరిష్కారం మాత్రం చేయడం లేదని రోడ్డు ఇలా గుంతలు పడడం వల్ల ఎంతో మంది ద్విచక్ర వాహనదారులు కింద పడిపోయి కాళ్లు చేతులు విరగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతున్నాయని, దీనివల్ల ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఒకసారి బెల్లంపల్లి లో ఉన్న అధికారులు అందరూ కూడా వారి వారి గవర్నమెంట్ వాహనాలలో తిరగకుండా ఒకసారి మంచి మనసు చేసుకొని ద్విచక్ర వాహనాల మీద వెళ్తే ప్రజల బాధ వారికి అర్థమవుతుందని అన్నారు.

ఇప్పటికైనా ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పందించి ఏరియా హాస్పిటల్ నుండి కొత్త బస్టాండ్ వరకు కొత్త రోడ్డు మంజూరు చేయించి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల ప్రాణాలను కాపాడాలని, అదేవిధంగా రోడ్లు ఊడువక దుమ్ము, దూలి, కండ్లలో పడి ప్రజలు ఇబ్బందులు ఎదురకొంటున్నారని వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్లకు ఇరువైపులా రోడ్డు ఊడిపించి ప్రజలకు ఇబ్బంది కలగకుండ చూడాలని ఎంసిపిఐ యూ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని, లేని యెడల ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో తగు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరేపల్లి రమేష్, మండల కార్యదర్శి ఆరేపల్లి సతీష్, తొగరి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.