మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:26 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే

పట్టణంలోని హనుమాన్ బస్తి లో గల సింగరేణి సబ్ స్టేషన్ గోడ వర్షానికి కూలింది. దీంతో హనుమాన్ బస్తీ సహ మరికొన్ని ప్రాంతాలలో సింగరేణి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సబ్ స్టేషన్ గోడ శనివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కూలిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పటికీ, సింగరేణి విద్యుత్ అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు.

సింగరేణి అధికారుల నిర్లక్ష్యంతో సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికుల కుటుంబాలు, కరెంటు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో సైతం గోడ కూలినప్పటికీ దానికి అధికారులు మరమ్మతులు చేయించలేదు.

సబ్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం పోగయి పిచ్చి మొక్కలు పెరగడంతో విష కీటకాలు, పాములు సైతం తిరుగుతున్నాయని చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇప్పటికైనా సింగరేణి అధికారులు నిర్లక్ష్యం వీడి సింగరేణి సబ్ స్టేషన్ కు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.