భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దిశ సమావేశానికి పాల్వంచ వచ్చిన ఖమ్మం పార్లమెంటు సభ్యులు శ్రీ రామసహాయం రఘురాం రెడ్డికి రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.
శనివారం కలెక్టర్ కార్యాలయం వద్ద కొత్వాల తో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఆయనను శాలువా మరియు బొకేలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, ఎల్డీఎం కోఆర్డినేటర్ బద్దికిషోర్ కాంగ్రెస్ నాయకులు వై వెంకటేశ్వర్లు, కందుకూరి రాము, పాబోలు నాగేశ్వరరావు, మాలోత్ కోటి నాయక్, భూక్య గిరి నాయక్, ధర్మసొత్ ఉపేందర్, కాపర్తి వెంకటాచారి, వాసమల్ల సుందర్రావు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
