మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:25 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే

బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్.హెచ్ఓ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రావు ని మాదిగ హక్కుల దండోరా నాయకులు శాలువా కప్పి,పుష్పగుచ్చంతో సత్కరించారు.

ఈ సందర్భంగా మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపెల్లి రాజం బెల్లంపల్లిలో శాంతి భద్రతలతో పాటు, పట్టణంలోని యువకులు మత్తు పదార్థాలకు గంజాయికు బానిసలు కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వారిని కోరారు. చర్చించారు.

ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర సీనియర్ నాయకులు అరకొండ శేఖర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాతరి కిరణ్, సీనియర్ నాయకులు ఎక్స్ కౌన్సిలర్ లింగంపల్లి రాములు, మాదిగ ప్రధాన కార్యదర్శి గద్దల కుమారస్వామి,పట్టణ ఉపాధ్యక్షుడు సిరికొండ మహేందర్,కార్యదర్శి కడప శంకర్,సీనియర్ నాయకులు ఎక్స్ కౌన్సిలర్ సముద్రాల శ్రీనివాస్,సీనియర్ నాయకులు కాంపెల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు .