మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కొకపెట్ లోని హరీష్ రావు ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. హరీష్ రావు ఇంటి ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. హరీష్ రావును కలిసేందుకు ఎవరిని అనుమతించడం లేదు. హరీష్ రావును కలిసేందుకు వచ్చిన ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు.
మాజీ మంత్రి హరీష్ రావును కలిసేందుకు వచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని ,మాజీ ఎంపీ మాలోతు కవితను పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ కమిషనర్ అనుమతి ఇస్తేనే హరీష్ రావుని కలవనిస్తామని పోలీసులు తేల్చి చెప్పారు.
తమ ఎమ్మెల్యేను కలవడానికి మీకు అనుమతి ఇవ్వాలని, మీకెందుకు అభ్యంతరం అని డిమాండ్ చేశారు. అయినా పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు వాగ్వాదం చోటుచేసుకుంది.
ఉదయం 11 గంటలకు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు నివాసంలో బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శంభీపూర్ రాజు ఇంటి వద్ద పోలీసులు మోహరించి, హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసానికి వస్తున్న పార్టీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు.