మంచిర్యాల జిల్లా,
హాజీపూర్,
తేది: 29 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే,
మంచిర్యాల జిల్లా, హాజీపూర్ మండలంలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయం భవనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి ఫర్టిలైజర్ షాపును సందర్శించిన అనంతరం పడ్తనపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల, భవిత కేంద్రం, సబ్బపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను పరిశీలించి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో పంచాయితీ కార్యదర్శులకు ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు.
