భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3వ మహాసభలు అశ్వరావుపేట కేంద్రంగా జూలై 26, 27 తేదీలలో జరుగునున్న నేపథ్యంలో గత మూడు సంవత్సరాల క్రితం మణుగూరు కేంద్రంగా జరిగిన 2వ మహాసభ ప్రాంగణం నుండి బయలుదేరిన అమరవీరుల స్మారక జ్యోతి యాత్ర గురువారం పాల్వంచ చేరుకున్న సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబా, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు ఉప్పుశెట్టి రాహుల్, గుండాల నాగరాజు, డీ సుధాకర్, ప్రజాసంఘాల నాయకులు వరక అజిత్, అన్నారపు వెంకటేశ్వర్లు, శనగారపు శ్రీనివాసరావు, నరహరి నాగేశ్వరరావు, వల్లపు యాకయ్య, జకరయ్య, శీను, ఆదినారాయణ, రాజు, లాల్ పాషా యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం పట్టణంలోని అమరజీవి సిద్ది వెంకటేశ్వర్లు స్మారక విగ్రహానికి, అమరజీవులు దేవభక్తిని రమేష్, దుగ్గినేని చంద్రశేఖర్, పాశం శ్రీనివాస్ రావు స్మారక స్థూపానిక, అమరజీవి ఉప్పు శెట్టి ఖాదర్ బాబు స్మారక స్థూపానికి, అమరజీవులు ఉషారావు, రామకోటయ్య స్మారకస్తుపానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రదర్శన నిర్వహించారు.
