ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: హేమంత
మాసం: పుష్య
పక్షం: శుక్ల – శుద్ధ
తిథి: దశమి రా.10:22 వరకు
తదుపరి ఏకాదశి
వారం: శనివారం – మందవాసరే
నక్షత్రం: కృత్తిక రా.తె.05:58 వరకు
తదుపరి రోహిణి
యోగం: శుభ ఉ.10:44 వరకు
తదుపరి శుక్ల
కరణం: తైతుల ఉ.11:03 వరకు
తదుపరి గరజ రా.10:22 వరకు
తదుపరి వణిజ
వర్జ్యం: రా.06:15 – 07:48 వరకు
దుర్ముహూర్తం: ఉ.06:49 – 08:14
రాహు కాలం: ఉ.09:38 – 11:02
గుళిక కాలం: ఉ.06:49 – 08:13
యమ గండం: ప.01:51 – 03:15
అభిజిత్: 12:04 – 12:48
సూర్యోదయం: 06:49
సూర్యాస్తమయం: 06:04
చంద్రోదయం: ప.01:25
చంద్రాస్తమయం: రా.01:55
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మేషం
దిశ శూల: తూర్పు
సాంబ దశమి
సూర్యారాధన
శాంబరీ దశమి
కృత్తికోపవాసము
ద్వార ధర్మదేవత పూజ
మాఘస్నానారంభం
శ్రీ సంపూర్ణానంద జయన్తీ
శ్రీ పరవస్తు వెంకట
రంగాచార్యుల స్మృతి దినం
నేటి రాశి ఫలాలు
మేషం
అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తోటివారి సూచనలు ఉపయోగపడతాయి. ద్వితీయ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
వృషభం
శుభకాలం. ప్రారంభించిన పని విజయవంతంగా పూర్తవుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం శుభప్రదం.
మిధునం
అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. ముఖ్య విషయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన వల్ల ఆత్మాభిమానం దెబ్బతింటుంది. వివాదాలకు పోవద్దు. శ్రీఆంజనేయ సందర్శనం శుభప్రదం.
కర్కాటకం
మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది. కనకధారా స్తోత్రం చదివితే బాగుంటుంది.
సింహం
ఆటంకాల వల్ల శ్రమ అధికం అవుతుంది. అభివృద్ధికి సంబంధించిన విషయంలో జాగ్రత్త. బంధు, మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. ఇష్టదేవతా ఆలయ సందర్శనం శుభప్రదం.
కన్య
మిశ్రమ కాలం. పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. ఇష్టదేవతా ధ్యానం శ్రేయోదాయకం.
తుల
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
వృశ్చికం
ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదవాలి.
ధనుస్సు
దైవబలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.
మకరం
మిశ్రమకాలం. కీలక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య విషయాల్లో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. నవగ్రహ స్తోత్రం చదవడం మంచిది.
కుంభం
మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ధర్మసిద్ధి ఉంది. చతుర్ధ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి విశ్రాంతి అవసరం. చంద్ర శ్లోకం చదువుకోవాలి.
మీనం
ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)