localnewsvibe

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

నేటి పంచాంగం

విక్రమ సంవత్సరం: 2080 నల

శక సంవత్సరం: 1945 శోభకృత్

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: శిశిర

మాసం: మాఘ

పక్షం: కృష్ణ – బహుళ

తిథి: చతుర్దశి సా.06:17 వరకు
తదుపరి అమావాశ్య

వారం: శనివారం – మందవాసరే

నక్షత్రం: ధనిష్ఠ ఉ‌.07:31వరకు
తదుపరి శతభిషం రా.తె.05:45 వరకు
తదుపరి పూర్వాభాద్ర

యోగం: సిద్ధ రా.08:33 వరకు
తదుపరి సాద్య

కరణం: భధ్ర ఉ‌.07:24 వరకు
తదుపరి శకుని సా.06:17 వరకు
తదుపరి చతుష్పాద రా.తె.05:12 వరకు
తదుపరి నాగవ

వర్జ్యం: ప‌.02:11 – 03:40 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.06:28 – 07:59

రాహు కాలం: ఉ‌.09:27 – 10:57

గుళిక కాలం: ఉ‌.06:28 – 07:58

యమ గండం: ప.01:56 – 03:25

అభిజిత్: 12:03 – 12:49

సూర్యోదయం: 06:28

సూర్యాస్తమయం: 06:24

చంద్రోదయం: ఉ.పూ.05:39

చంద్రాస్తమయం: సా.05:28

సూర్య సంచార రాశి: కుంభం

చంద్ర సంచార రాశి: కుంభం

దిశ శూల: తూర్పు

అరుణోదయ స్నానం

శివ బిల్వార్చన‌

శ్రీశైలం శ్రీ మల్లికార్జునస్వామి రథోత్సవం

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి కల్యాణోత్సవం

శ్రీ కాళహస్తీశ్వర రథోత్సవం

శిరోడా‌ కామాక్షిదేవి జాతర‌

నందుర్బార్‌ శ్రీ దేవమోగరా
మాతా జాతర‌


నేటి రాశి ఫలాలు


మేషం

మనోబలంతో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. లాభంలో చంద్రబలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈశ్వర ఆరాధనతో మంచి ఫలితాలు వస్తాయి.

వృషభం

ప్రారంభించబోయే పనిలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ముఖ్యమైన పనులు చేసే ముందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. దైవబలం రక్షిస్తుంది. వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శుభకార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. లక్ష్మీస్థితి అదృష్టాన్ని ఇస్తుంది.

మిధునం

మీ మీ రంగాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు. నిండు మనసుతో పనులను పూర్తిచేస్తారు. ప్రశంసలను అందుకుంటారు. తోటివారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. నవమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. ఎవరినీ అతిగా నమ్మి మోసపోవద్దు. దుర్గాధ్యానం చేస్తే మంచిది.

కర్కాటకం

కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. నిరుత్సాహపడకుండా పనిచేస్తే విజయానికి చేరువవుతారు. విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు. అష్టమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శ్రీసూర్యనారాయణమూర్తి సందర్శనం శ్రేయోదాయకం.

సింహం

ప్రారంభించబోయే పనిలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ఎదుర్కొంటారు. విజయం వరిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. ఎవరినీ అతిగా నమ్మి మోసపోకండి. ప్రయాణంలో జాగ్రత్త. శివ ధ్యానం చేస్తే మంచిది.

కన్య

చక్కటి ఆలోచన విధానంతో భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో కీలకనిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మాట పట్టింపులకుపోవద్దు. శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

తుల

సంపూర్ణ ఆత్మబలంతో విజయసిద్ధి కలదు. మీ మీ రంగాల్లో ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. పంచమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. అస్థిరనిర్ణయాల వల్ల మీ మీద ఒత్తిడి పెరుగుతుంది. అపార్థాలకు తావివ్వకండి. ఆదిత్యహృదయం చదివితే మంచిది.

వృశ్చికం

విశేషమైన ఏకాగ్రతతో చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి. తోటివారి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. చతుర్ధంలో చంద్రసంచారం వ్యతిరేక ఫలితాలను ఇస్తోంది. మనఃశ్శాంతి కోసం చంద్రధ్యానం చేయండి.

ధనుస్సు

మీదైన రంగంలో పట్టుదల, ఏకాగ్రత మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించే ముందు కుటుంబసభ్యుల అంగీకారం తప్పనిసరి. ముఖ్యమైన విషయాల్లో ముందుచూపుతో వ్యవహరించడం ద్వారా ఇబ్బందులు తొలుగుతాయి. గణపతిని స్మరిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

మకరం

మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించి విజయంసాధిస్తారు. తోటివారి సహకారంతో పనులు చక్కగా పూర్తవుతాయి. కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసే ఆలోచనలు ఫలిస్తాయి. ద్వితీయంలో చంద్రబలం తక్కువగా ఉంది. మనఃశ్శాంతి లోపించకుండా కాపాడుకోవాలి. సూర్యస్తుతి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కుంభం

ప్రారంభించిన కార్యక్రమాలలో ఆశించిన ఫలితాలు వస్తాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగస్తులకు శుభకాలం. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభదాయకం.

మీనం

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. పెద్దలతో మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు మనసులో అనుకుని మాట్లాడటం మంచిది. ద్వాదశంలో చంద్రుడు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్నారు. మనఃశ్శాంతి కోసం ఈశ్వర ఆరాధన చేయండి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)