ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం:’2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: ఫాల్గుణ
పక్షం: శుక్ల – శుద్ధ
తిథి: ద్వాదశి రా.తె.05:53 వరకు
తదుపరి త్రయోదశి
వారం: గురువారం – బృహస్పతివాసరే
నక్షత్రం: ఆశ్లేష రా.02:44 వరకు
తదుపరి మఘ
యోగం: సుకర్మ సా.05:40 వరకు
తదుపరి ధృతి
కరణం: బవ సా.05:06 వరకు
తదుపరి బాలవ రా.తె.05:53 వరకు
తదుపరి కౌలువ
వర్జ్యం: ప.02:36 – 04:20 వరకు
దుర్ముహూర్తం: ఉ.10:21 – 11:10
మరియు ప.03:13 – 04:02
రాహు కాలం: ప.01:54 – 03:25
గుళిక కాలం: ఉ.09:21 – 10:52
యమ గండం: ఉ.06:19 – 07:50
అభిజిత్: 11:59 – 12:47
సూర్యోదయం: 06:19
సూర్యాస్తమయం: 06:27
చంద్రోదయం: ప.03:26
చంద్రాస్తమయం: రా.03:57
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
దిశ శూల: దక్షిణం
దేశబేదన – అతిరిక్త ఏకాదశి ( మతాంతరం )
నృసింహ ద్వాదశి
ఆమలక ద్వాదశి
ఆమలక జనార్ధన పూజ
గంగా స్నానం
విజయ – సుగతి ద్వాదశి
పుండరీకాక్ష పూజ
సుకృత – మనోరథ ద్వాదశి
తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహ
స్వామి గరుడోత్సవం
గోవింద ద్వాదశి ( పుష్యమి రహితం)
శ్రీ రామచంద్రగోపాలకృష్ణ మఠం
శ్రీ రామానంద సరస్వతి స్వామి
పుణ్యతిథి
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ
స్వామి కల్యాణోత్సవం
పయోవ్రత సమాప్తి
మధరై శ్రీ వేంకటేశ్వరపెరుమాళ్
వెన్నై థాజీ ఉత్సవం
పడుబిద్రి మహాలింగేశ్వర
మహాగణపతి రథోత్సవం
నేటి రాశి ఫలాలు
మేషం
ప్రారంభించిన పనిలో విజయం వరిస్తుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థికంగా బలపడతారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. శ్రీఆంజనేయస్వామి దర్శనం మేలు చేస్తుంది.
వృషభం
స్వల్ప ప్రయత్నంతో గొప్ప కార్యక్రమాలను పూర్తి చేస్తారు. పెద్దలు చెప్పిన సూచనలతో పనులు త్వరగా పూర్తవుతాయి. కుటుంబం అభివృద్ధి కోసం మీరు చేసే కృషి ఫలిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శివారాధన శుభప్రదం.
మిధునం
ప్రారంభించబోయే పనుల్లో ప్రయత్నబలాన్ని పెంచాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తే లక్ష్యం నెరవేరుతుంది. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆర్థికపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీరామనామాన్ని జపించాలి.
కర్కాటకం
అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. ప్రారంభించిన కార్యక్రమాలలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. సమాజంలో గౌరవం తగ్గకుండా కాపాడుకోవాలి. ఆర్థికపరంగా జాగ్రత్తలు అవసరం. శ్రీలక్ష్మీ స్తుతి శుభప్రదం.
సింహం
ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు. ప్రారంభించబోయే పనుల్లో అవగాహనాలోపం లేకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యమైన విషయంలో అనుభవజ్ఞులు సూచనలను తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. విష్ణుమూర్తిని ధ్యానించండి.
కన్య
మీదైన రంగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. స్వల్ప ప్రయత్నంతో విజయం వరిస్తుంది. ఆర్థికపరమైన అభివృద్ధి సాధిస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుప్రీతి ఉంది. శివారాధనతో మరిన్ని విజయాలు సొంతం అవుతాయి.
తుల
ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. అనుకున్నది సాధించే వరకు పోరాటం ఆపకండి. తోటి వారి సహకారంతో ఒక పని పూర్తవుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. హనుమాన్ చాలీసా చదవండి.
వృశ్చికం
వ్యాపారంలో భక్తిశ్రద్ధలతో పనిచేయడం ద్వారా లాభాలు వస్తాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు. అనవసర ఖర్చులు సూచితం. ప్రయాణాల్లో జాగ్రత్త. అప్పులు ఇబ్బంది పెడతాయి. రుణ విమోచక అంగారక స్తోత్రం చదివితే మేలు జరుగుతుంది.
ధనుస్సు
శుభకాలం. ఆలోచనలు వికసిస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. మీ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆదాయానికి దగ్గర సూచన ఉంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించండి.
మకరం
తోటివారి సహకారంతో పనులను పూర్తి చేస్తారు. అస్థిరబుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. తోటి వారి సలహాలతో చక్కటి ఫలితాలను సాధిస్తారు. కుటుంబ వ్యక్తులను ప్రేమ భావంతో చూడడం ద్వారా చక్కటి ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయం చదివితే మంచిది.
కుంభం
సంపూర్ణ మనోబలంతో విజయాలు సాధిస్తారు. చాప కింద నీరులా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. కలహాలతో కాలాన్ని వృథా చేసుకోకండి. ఆరోగ్యం విషయంలో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సలహాలు ఉపయోగపడతాయి. గణపతిని ధ్యానించండి.
మీనం
మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. ముందస్తు ప్రణాళికలతో శ్రమ తగ్గుతుంది. వ్యాపార పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయ పారాయణం మేలు చేస్తుంది.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)