ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

నేటి పంచాంగం

విక్రమ సంవత్సరం: 2080 నల

శక సంవత్సరం: 1945 శోభకృత్

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: శిశిర

మాసం: ఫాల్గుణ

పక్షం: శుక్ల – శుద్ధ

తిథి: విదియ ఉ‌.11:14 వరకు
తదుపరి తదియ

వారం: మంగళవారం – భౌమవాసరే

నక్షత్రం: రేవతి రా.12:47 వరకు
తదుపరి అశ్విని

యోగం: శుక్ల ఉ‌.07:53 వరకు
తదుపరి బ్రహ్మ రా.తె.04:08 వరకు
తదుపరి ఐంద్ర

కరణం: కౌలువ ఉ‌.11:14 వరకు
తదుపరి తైతుల రా.10:08 వరకు
తదుపరి గరజ

వర్జ్యం: ప‌.01:33 – 03:03 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.08:50 – 09:38
మరియు రా. 11:11 – 11:59

రాహు కాలం: ప‌.03:25 – 04:55

గుళిక కాలం: ప‌.12:26 – 01:56

యమ గండం: ఉ‌.09:26 – 10:56

అభిజిత్: 12:02 – 12:48

సూర్యోదయం: 06:26

సూర్యాస్తమయం: 06:25

చంద్రోదయం: ఉ‌.07:47

చంద్రాస్తమయం: రా.08:33

సూర్య సంచార రాశి: కుంభం

చంద్ర సంచార రాశి: మీనం

దిశ శూల: ఉత్తరం

విష్ణు విదియ వ్రతారంభం‌

శతవర్షవ్రతం‌

మృత్యుంజయ పూజ

శ్రీ రామకృష్ణ పరమహంస జయన్తీ (మతాంతరం)

శ్రీ రామకృష్ణ క్షీరసాగర్ దత్త మహారాజ్ జయన్తీ

శ్రీ విమలాఫాడ్కే‌ పుణ్యతిథి‌

శ్రీ డోంగ్రే‌ మహారాజ్ జయన్తీ

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవఆరంభం

కురంగణి శ్రీ ముత్తుమలై‌ అమ్మన్‌ రథోత్సవం

చింతలూరు నూకాంబిక
జాతర‌ ఉత్సవారంభం‌

హళేబీడు‌ మాదేశ్వర‌ రథోత్సవం

శ్రీ గురు రాఘవేంద్రస్వామి
వేదాంత సామ్రాజ్య పట్టాభిషేక దినోత్సవం

హొరనాడు‌ అన్నపూర్ణేశ్వరి‌ రథోత్సవం


నేటి రాశి ఫలాలు


మేషం

ప్రారంభించిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి. శివారాధన శుభప్రదం.

వృషభం

విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. మనసు చెడ్డ పనుల మీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమంతుడిని ఆరాధించాలి.

మిధునం

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని అందిస్తాయి. శారీరక శ్రమ అధికం అవుతుంది. వాదులాటకు దూరంగా ఉండటమే మంచిది. శని శ్లోకాన్ని చదవండి.

కర్కాటకం

ప్రారంభించబోయే పనుల్లో మంచి పలితాలు రాబడతారు. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. శ్రీఆంజనేయుడిని ఆరాధిస్తే మంచిది.

సింహం

బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనో ధైర్యాన్ని కోల్పోరాదు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళనపడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

కన్య

చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. గణపతి ఆరాధన శుభప్రదం.

తుల

కీలక వ్యవహారంలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. కోపతాపాలకు పోకండి. మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది. శివాష్టోత్తరం చదవాలి.

వృశ్చికం

కర్మసిద్ధి ఉంది. ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బద్ధకాన్ని దరిచేరనీయకండి. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

ధనుస్సు

ప్రారంభించిన పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

మకరం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సమయపాలనతో పనులను పూర్తిచేస్తారు. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.

కుంభం

కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా చదవాలి.

మీనం

మీ మీ రంగాల్లో చక్కటి శుభఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు ఆరాధన చేస్తే మంచిది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)