ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: ఫాల్గుణ
పక్షం: కృష్ణ – బహుళ
తిథి: విదియ ప.03:36 వరకు
తదుపరి తదియ
వారం: బుధవారం – సౌమ్యవాసరే
నక్షత్రం: చిత్ర ప.02:58 వరకు
తదుపరి స్వాతి
యోగం: వ్యాఘత రా.10:53 వరకు
తదుపరి హర్షణ
కరణం: గరజ ప.03:36 వరకు
తదుపరి వణిజ రా.04:13 వరకు
తదుపరి భధ్ర
వర్జ్యం: రా.09:00 – 10:44 వరకు
దుర్ముహూర్తం: ఉ.11:56 – 12:46
రాహు కాలం: ప.12:21 – 01:53
గుళిక కాలం: ఉ.10:49 – 12:21
యమ గండం: ఉ.07:46 – 09:18
అభిజిత్: 11:57 – 12:45
సూర్యోదయం: 06:14
సూర్యాస్తమయం: 06:28
చంద్రోదయం: రా.08:12
చంద్రాస్తమయం: ఉ.07:17
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: తుల
దిశ శూల: ఉత్తరం
చాతుర్మాస్య ద్వితీయ
శ్రీ సుధీంద్రతీర్థ పుణ్యతిథి
చిత్రగుప్త పూజ
సంత్ తుకారాం ద్వితీయ
సంత్ తుకారాం మహారాజ్
వైకుంఠగమన దినం
భాతృద్వితీయ
సంత్ జనార్ధన వాగళే
పుణ్యతిథి
మన్నార్‌గుడి శ్రీ రాజగోపాల
స్వామి ఉత్సవారంభం
నేటి రాశి ఫలాలు
మేషం
చక్కటి ఆలోచన విధానంతో భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. తోటి వారి సహకారంతో పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
వృషభం
ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగులకు శుభకాలం. వ్యాపారంలో అనుకూలత ఉంది. ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభదాయకం.
మిధునం
సంపూర్ణ ఆత్మబలంతో విజయసిద్ధి కలదు. మీ మీ రంగాల్లో ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. పంచమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. అస్థిర నిర్ణయాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అపార్థాలకు తావివ్వకండి. ఆదిత్య హృదయం చదివితే మంచిది.
కర్కాటకం
విశేషమైన ఏకాగ్రతతో ప్రయత్నాలు నెరవేరుతాయి. తోటి వారి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. చతుర్ధంలో చంద్ర సంచారం వ్యతిరేక ఫలితాలను ఇస్తోంది. మనఃశ్శాంతి కోసం చంద్రధ్యానం చేయండి.
సింహం
ప్రారంభించబోయే పనిలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ముఖ్యమైన పనులు చేసే ముందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. దైవబలం రక్షిస్తోంది. వ్యాపార పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శుభకార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. శ్రీలక్ష్మీస్తుతి అదృష్టాన్ని ఇస్తుంది.
కన్య
మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించి విజయం సాధిస్తారు. తోటి వారి సహకారంతో పనులు చక్కగా పూర్తవుతాయి. కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసే ఆలోచనలు ఫలిస్తాయి. ద్వితీయంలో చంద్రబలం తక్కువగా ఉంది. మనఃశ్శాంతి లోపించకుండా కాపాడుకోవాలి. సూర్యస్తుతి మంచి ఫలితాన్ని ఇస్తుంది.
తుల
ప్రారంభించబోయే పనిలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ఎదుర్కొంటారు. విజయం వరిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. శివధ్యానం చేస్తే మంచిది.
వృశ్చికం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. పెద్దలతో మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు మనసులో అనుకుని మాట్లాడటం మంచిది. ద్వాదశంలో చంద్రుడు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్నాడు. మనఃశ్శాంతి కోసం ఈశ్వర ఆరాధన చేయండి.
ధనుస్సు
మనోబలంతో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికారులు అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. లాభంలో చంద్రబలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈశ్వర ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
మకరం
మీదైన రంగంలో పట్టుదల, ఏకాగ్రత మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించే ముందు కుటుంబ సభ్యుల అంగీకారం తప్పనిసరి. ముఖ్యమైన విషయాల్లో ముందుచూపుతో వ్యవహరించడం ద్వారా ఇబ్బందులు తొలుగుతాయి. గణపతిని స్మరిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
కుంభం
మీ మీ రంగాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు. నిండు మనసుతో పనులను పూర్తిచేస్తారు. ప్రశంసలను అందుకుంటారు. తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. నవవంలో చంద్రబలం అనుకూలంగా లేదు. ఎవరిని అతిగా నమ్మి మోసపోవద్దు. దుర్గా ధ్యానం చేస్తే మంచిది.
మీనం
కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. నిరుత్సాహపడకుండా పనిచేస్తే విజయానికి చేరువవుతారు. విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు. అష్టమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శ్రీసూర్యనారాయణ మూర్తి సందర్శనం శ్రేయోదాయకం.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)