ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: మాఘ
పక్షం: కృష్ణ – బహుళ
తిథి: ఏకాదశి రా.12:32 వరకు
తదుపరి ద్వాదశి
వారం: బుధవారం – సౌమ్యవాసరే
నక్షత్రం: పూర్వాషాఢ ఉ.11:06 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
యోగం: వ్యతీపాత ఉ.11:33 వరకు
తదుపరి వరియాన
కరణం: బవ ప.01:14 వరకు
తదుపరి బాలవ రా.12:32 వరకు
తదుపరి కౌలువ
వర్జ్యం: రా.06:48 – 08:21 వరకు
దుర్ముహూర్తం: ప.12:03 – 12:51
రాహు కాలం: ప.12:27 – 01:56
గుళిక కాలం: ఉ.10:58 – 12:27
యమ గండం: ఉ.07:59 – 09:29
అభిజిత్: 12:04 – 12:50
సూర్యోదయం: 06:30
సూర్యాస్తమయం: 06:23
చంద్రోదయం: రా.03:01
చంద్రాస్తమయం: ప.02:12
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
దిశ శూల: ఉత్తరం
విజయ ఏకాదశి
శ్రీ మాధవ్ సదాశివ్గో ల్వాల్కర్ జయన్తీ
ప్రవర – గోదావరి సంగమ సిద్ధేశ్వర్ యాత్ర, నెవాస్
శ్రీ నరసింహ శాస్తవు ఉబరడ్క జాతర
శ్రీరంగం నంపెరుమాళ్ అలంకార తిరుమంజన సేవ
నేటి రాశి ఫలాలు
మేషం
భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమం.
వృషభం
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చంద్రధ్యానశ్లోకం చదివితే మంచి జరుగుతుంది.
మిధునం
శుభకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం చదవాలి.
కర్కాటకం
కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
సింహం
మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.
కన్య
మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం చదవడం శుభప్రదం.
తుల
బుద్దిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలకనిర్ణయాలు తీసుకుంటారు. చెప్పుడు మాటలను వినకండి. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.
వృశ్చికం
మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి, తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటీరెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త. చంద్రధ్యానం శుభప్రదం.
ధనుస్సు
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులు కొంటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి జరుగుతుంది.
మకరం
ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బంది పడతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి.
కుంభం
మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
మీనం
మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బంది పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. దుర్గా అష్టోత్తరం చదవడం శ్రేయోదాయకం.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)