ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: హేమంత
మాసం: పుష్య
పక్షం: కృష్ణ – బహుళ
తిథి: దశమి ప.01:01 వరకు
తదుపరి ఏకాదశి
వారం: సోమవారం – ఇందువాసరే
నక్షత్రం: జ్యేష్ఠ రా.తె.04:15 వరకు
తదుపరి మూల
యోగం: ధృవ ఉ.10:22 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: భధ్ర ప.01:01 వరకు
తదుపరి బవ రా.12:42 వరకు
తదుపరి బాలవ
వర్జ్యం: ఉ.09:43 – 11:20 వరకు
దుర్ముహూర్తం: ప.12:53 – 01:39
మరియు ప.03:10 – 03:56
రాహు కాలం: ఉ.08:12 – 09:38
గుళిక కాలం: ప.01:55 – 03:21
యమ గండం: ఉ.11:04 – 12:30
అభిజిత్: 12:08 – 12:52
సూర్యోదయం: 06:46
సూర్యాస్తమయం: 06:13
చంద్రోదయం: రా.02:14
చంద్రాస్తమయం: ప.01:27
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
దిశ శూల: తూర్పు
బ్రహ్మచారి మహారాజ్
పుణ్యతిథి
మహర్షి మహేష్ యోగి
స్మృతి దినం
ఏకభుక్తము
వేదారణ్యం త్యాగరాజర్
ఉత్సవారంభం
నేటి రాశి ఫలాలు
మేషం
అనుకూలమైన సమయం. మొహమాటాన్ని వీడితే ఇబ్బందులు దరి చేరవు. ఉన్నతమైన ఆలోచనలు చేసి వాటిని సాధించే వరకు వదిలిపెట్టరు. ఆర్ధిక అభివృద్ధి కలదు. లక్ష్మీ గణపతి ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది.
వృషభం
ఉద్యోగస్తులకు శుభకాలం. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయంలో పై అధికారుల సహకారం అందుతుంది. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఆర్థికపరంగా శుభకాలం, శివనామం జపించాలి.
మిధునం
మీ మీ రంగాలలో మీ బుద్ధి బలాన్ని ఉపయోగించి ఓ కీలక సమస్యను పరిష్కారం చేస్తారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. ఆదాయానికి తగ్గట్టే ఖర్చులు ఉంటాయి. శివపార్వతుల సందర్శనం చేయాలి.
కర్కాటకం
పనిలో ఏకాగ్రత లోపించకుండా జాగ్రత్త పడండి. కీలక నిర్ణయాలు తీసుకోబోయే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ధనయోగం మిశ్రమంగా ఉంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన శ్రేష్టం.
సింహం
మీ ఆత్మవిశ్వాసమే మీ విజయం. ఉద్యోగస్తులకు మంచి కాలం. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టబోయే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం కామాక్షే నమః అనే నామాన్ని జపించాలి.
కన్య
చేపట్టిన పనుల్లో ఆనందకరమైన ఫలితాలు సాధిస్తారు. తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ధన లాభం సూచితం. వినాయక సందర్శనం మేలు చేస్తుంది.
తుల
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు సాధించడానికి శ్రమ అధికమవుతుంది. ఎవరినీ అతిగా నమ్మరాదు. ఆర్థికంగా మేలైన ఫలితాలు ఉన్నాయి. సూర్య నమస్కారం చేస్తే మంచిది.
వృశ్చికం
మీ మీ రంగాల్లో అభివృద్ధి సాధించాలని తపన మిమ్మల్ని గెలుపు బాట పట్టిస్తుంది. అవసరానికి తగిన ధనం చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఇంటి ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఈశ్వర ధ్యానం సత్ఫలితాన్ని ఇస్తుంది.
ధనుస్సు
సవాళ్ళని స్వీకరించి వాటిని ఎదుర్కొనే తత్వం మిమల్ని విజయానికి చేరువ చేస్తుంది. గిట్టని వారు చాప కింద నీరు లాగా ఇబ్బంది పెడతారు. స్థిర సంపాదన కలదు. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. లలితా దేవి నామస్మరణ మంచిది.
మకరం
మంచి ఆలోచనలతో మీరు చేసే పని సత్ఫలితాలను ఇస్తుంది. మీ ప్రతిభే మీకు ఆయుధం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకెళతారు. ఆర్ధికంగా పర్వాలేదు అనిపిస్తుంది దైవ బలం పెరగడానికి గురు ధ్యాన శ్లోకం చదవాలి.
కుంభం
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కష్టేఫలి అనే సూత్రాన్ని దృష్టిలో ఉంచుకుని అందర్నీ కలుపుకొని పోవడం వల్ల పనులు సులభంగా పూర్తవుతాయి. అవసరానికి తగ్గట్టు ఖర్చు చేయాలి. శని శ్లోకం చదువుకోవాలి.
మీనం
మీరు వేయబోయే అడుగు గురించి స్థిరంగా ఆలోచించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. దుర్గా ధ్యానం శ్రేయదాయకం.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)