ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: హేమంత
మాసం: పుష్య
పక్షం: కృష్ణ – బహుళ
తిథి: సప్తమి ఉ.11:51 వరకు
తదుపరి అష్టమి
వారం: శుక్రవారం – భృగువాసరే
నక్షత్రం: స్వాతి రా.02:18 వరకు
తదుపరి విశాఖ
యోగం: శూల ప.12:25 వరకు
తదుపరి గండ
కరణం: బవ ఉ.11:51 వరకు
తదుపరి బాలవ రా.12:15 వరకు
తదుపరి కౌలువ
వర్జ్యం: ఉ.పూ.06:34 – 08:17 వరకు
దుర్ముహూర్తం: ఉ.09:04 – 09:50
మరియు ప.12:52 – 01:38
రాహు కాలం: ఉ.11:04 – 12:29
గుళిక కాలం: ఉ.08:13 – 09:38
యమ గండం: ప.03:20 – 04:46
అభిజిత్: 12:07 – 12:51
సూర్యోదయం: 06:47
సూర్యాస్తమయం: 06:11
చంద్రోదయం: రా.12:22
చంద్రాస్తమయం: ఉ.11:16
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: తుల
దిశ శూల: పశ్చిమం
కాలాష్టమి
అష్టకశ్రాద్దము
శ్రీ నరహరితీర్థ పుణ్యతిథి
స్వామి వివేకానంద జయన్తీ
శ్రీ రామానందాచార్య జయన్తీ
శ్రీ ధర్మేంద్రాచార్య జయన్తీ
కేరోబా మహారాజ్ పుణ్యతిథి
ఆత్మానందసర్ రామచంద్ర
పుణ్యతిథి
కిత్తూరు రాణి చెన్నమ్మ
స్మృతి దినం
నేటి రాశి ఫలాలు
మేషం
ప్రారంభించిన పనుల్లో త్వరితగతిన విజయం సాధిస్తారు. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. అర్ధలాభం ఉంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. లింగాష్టకం చదవాలి. విజయం సాధిస్తారు. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. అర్ధలాభం ఉంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. లింగాష్టకం చదవాలి.
వృషభం
ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
మిధునం
సమయానుకూలంగా ముందుకు సాగండి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం సూచితం. మానసిక ప్రశాంతత కోసం శ్రీలక్ష్మి సందర్శనం ఉత్తమం.
కర్కాటకం
కీలక విషయాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడగాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తి చెందక పోవచ్చు. అస్థిరనిర్ణయాలతో సతమతం అవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.
సింహం
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధు, మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్రం చదవడం మంచిది.
కన్య
ప్రారంభించబోయే పనుల్లో అలసట పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటే ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. శ్రీమహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.
తుల
జన్మస్థ చంద్ర బలం అనుకూలంగా ఉంటుంది. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ఒక ముఖ్య విషయంగా పెద్దలను కలుపుతారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. ఈశ్వర ధ్యానం శుభదాయకం.
వృశ్చికం
వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ద్వాదశ చంద్రబలం అనుకూలంగా లేదు. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. దుర్గాధ్యానం వల్ల
ధనుస్సు
అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు అందుతుంది. ధార్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శని శ్లోకం చదివితే మంచిది.
మకరం
ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తవుతుంది. దశమస్థ చంద్రబలం అనుకూలంగా ఉంటుంది. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు. సూర్య ఆరాధన శుభదాయకం.
కుంభం
మంచి మనస్సుతో చేసే పనులు ఫలిస్తాయి. బంధువులతో అతి చనువు వద్దు. ఆర్థికంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతున్నారు.
మీనం
మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా చదవాలి.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)