మెదక్ జిల్లా
మాసాయిపేట మండలం
✍️శివ కుమార్ గౌడ్
మాసాయిపేట మండల కేంద్రంలోని పోచమ్మ దేవాలయం వద్ద ఎంపీ రఘునందన్ రావు సహకారంతో మంజూరైన సోలార్ లైటింగ్ సిస్టంను ఆయన ప్రారంభించారు.
10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మెదక్ జిల్లాకు ఎంపీ నిధులు వచ్చేవి కావని, రఘునందన్ రావు ఎంపీగా గెలిచిన తర్వాత మెదక్ నియోజకవర్గానికి ఎంపీ నిధులు మంజూరు అవుతున్నాయని మాసాయిపేట బిజెపి మండల పార్టీ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి అన్నారు.
మండల వ్యాప్తంగా ఐదు గ్రామాల్లో సోలార్ లైటింగ్ సిస్టంను ఎంపీ రఘునందన్ రావు మంజూరు చేశారని తెలిపారు. గతంలో ఎంపీ నిధులు నియోజకవర్గంలో ఖర్చు చేసేవారు కాదని, రఘునందన్ రావు గెలిచిన తర్వాతనే మెదక్ జిల్లాకు అభివృద్ధి నిధులు మంజూరు అవుతున్నాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి బిజెపి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
