మంచిర్యాల జిల్లా,
మంచిర్యాల,
తేదీ:1 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మంచిర్యాల క్రికెట్ అసోసియేషన్ మంచిర్యాల అధ్యక్షుడు పైడిమల్ల నర్సింగ్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా బీసీసీఐ పంపే లక్షలాది రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, దీనికి బాధ్యులైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా బాధ్యులు ప్రదీప్ పై హైదరాబాద్ సిఐడి కార్యాలయంలో పిర్యాదు చేశారని చెప్పారు.

ఈ సందర్భంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పైడిమల నర్సింగ్, జిల్లా కోఆర్డినేటర్ అల్లం వెంకటేశ్వర్లు, టిసిఏ రాష్ట్ర కమిటీ సభ్యులందరు కలిసి ఫిర్యాదు చేసారని తెలిపారు. గతంలో మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ కు ప్రదీప్ చేసిన నిధుల దుర్వినియోగం పైన లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారని తెలిపారు.

దీనిపై ఇంత వరకు ఎటువంటి విచారణ చేయనందున తెలంగాణ రాష్ట్ర సిఐడి కార్యాలయంలో సాక్షాదారలతో సహా హెచ్.సీ.ఏ మంచిర్యాల జిల్లా బాధ్యులు ప్రదీప్ పైన పిర్యాదు చేశారని,దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి దోచుకున్న నిధులను మంచిర్యాల జిల్లా క్రికెట్ క్రీడాకారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణా క్రికెట్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా పక్షాన సిఐడి అధికారులను కోరారు.