భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
సీపీఐ జిల్లా కార్యదర్శిగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన షేక్ సాబీర్ పాషాను జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా శుక్రవారం నాడు తన స్వగ్రహంలో ఘనంగా సన్మానించారు. విద్యార్ధి దశ నుండి పేదల కొరకు నిరంతర పోరాటం చేసే సాబీర్ పాషా కుల మతాలకతీతంగా తన వంతుగా నిరంతరం శ్రమిస్తూ పేదల పక్షాన నిలబడుతున్నారని, దేవుని కృపతో వారు ప్రజలకు మరింత సేవలందించి ఆయూ ఆరోగ్యాలతో ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమములో మైనారిటీ నాయకులు మాజిద్ ఖురేషీ, కలీం, గౌస్ పాషా, మజహర్, ఖలీల్ తదితరులకు పాల్గొన్నారు.
