భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
రైతు బాంధవుడు, ప్రజల మనిషి మేదరమెట్ల – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
సుజాతనగర్ మండల కాంగ్రెస్ నాయకులు సంతాపం
పాల్వంచ లో పలు మరణ కార్యక్రమాల్లో పాల్గొన్న కొత్వాల
రైతు బాంధవులు, ప్రజల మనిషి మేదరమెట్ల అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, KTPS రిటైర్డ్ ADE మేదరమెట్ల వెంకటేశ్వరరావు అనారోగ్యం తో మరణించారు. శనివారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధి సీతారాంపట్నం లోని ఆయన స్వగృహం లో ఫ్లెక్సీ కి కొత్వాల తో పాటు సుజాత నగర్ మండల కాంగ్రెస్ నాయకులు పలువురు నివాళిలర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపారు. ఈ సందర్బంగా కొత్వాల మాట్లాడుతూ పాల్వంచ మండలంలోని ప్రజలకు, రైతులకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి మేదరమెట్ల అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మేదరమెట్ల కుమారుడు మేదరమెట్ల రాకేష్, సోదరుడు మేదరమెట్ల కృష్ణ, కుటుంబ సభ్యులు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, సుజాత నగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, నాయకులు సామినేని రామారావు, చిమటా నాగేశ్వరరావు, నామా నవీన్, నామా పండు తదితరులు పాల్గొన్నారు.
శనివారం పలు మరణ కార్యక్రమాల్లో పాల్గొన్న కొత్వాల
పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలని ఎర్రగుంట నివాసి చిన్నాల రామచంద్రయ్య మరణించారు. శనివారం ఆయన స్వగృహంలోని భౌతిక కాయానికి కొత్వాల నివాళిలర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ కార్యక్రమం లో నరిగే రమేష్, ఎర్రగుంట సాంబశివరావు, కొండం వెంకన్న చారుగుండ్ల వెంకటేశ్వర్లు, వల్లపు యాకయ్య, మండల సత్యనారాయణ, యల్లావుల కోటేశ్వరరావు, మేకా ప్రసాద్, నాళం మల్లేశ్వరరావు, అహ్మద్ జాని, బొందిలి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ మండల పరిధిలోని జగన్నాధపురం నివాసి కాటిరేగుల కోటమ్మ మరణించారు. శనివారం ఆమె స్వగృహంలోని భౌతిక కాయానికి కొత్వాల నివాళిలర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి, సంతాపం తెలిపారు.
ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, RTA మెంబర్ బాదర్ల జ్యోషి కుమార్, బానోత్ బాలాజీ, కామాచారి తదితరులు పాల్గొన్నారు.
