మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:3 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయురాలు ఎర్ర సువర్ణ సేవలు అభినందనీయమని పలువురు ప్రశంసించారు.
ఆమె ఉపాధ్యాయ వృత్తితో పాటు పలు సామాజిక కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారని, పల్లె ప్రాంతాల్లో చదువుకు దూరంగా ఉన్న ఎంతో మందిని బడి బాట పట్టేలా కృషి చేశారని కొనియాడారు.
ఆదివారం పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గెల్లి రాజలింగు,మురుకూరి చంద్రయ్య, ఏం.శ్రావణ్ శాలువాతో సన్మానించారు.
