మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:1 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మద్యం దుకాణాల పెంపు ఆలోచనను వెంటనే వెనక్కి తీసుకోవాలి… మద్యం దుకాణాల పెంపుతో గ్రామాల్లో పెరుగనున్న అరాచకాలు

ఏ ఐ ఎఫ్ డి డబ్ల్యూ ( అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య) జిల్లా కార్యదర్శి దుర్గం లక్ష్మి డిమాండ్

ఈరోజు ఏం సిపిఐయు పార్టీ కార్యాలయంలో ఏ.ఎఫ్.డి.డబ్ల్యూ ( అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య ) జిల్లా కార్యదర్శి దుర్గం లక్ష్మి మాట్లాడుతూ…

ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో గ్రామాల్లో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనందని, ఒకవైపు మద్యం, ఉచ్చులో పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటుంటే వారి భవిష్యత్తును మరింత అంధకారంగా చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి మద్యం దుకాణాల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కేసీఆర్ తీసుకొచ్చిన మద్యం దుకాణాలను మొత్తం ఎత్తివేస్తామని, బూటకపు హామీలు ఇచ్చి నేడు వాటిని విస్మరిస్తూ రెండు వేల మద్యం షాపులు 500 బార్లకు కొత్త అనుమతులు ఇవ్వడానికి సిద్ధపడడమనేది చాలా సిగ్గుచేటు. గ్రామాల్లో మద్యం షాపులు పెట్టడం మూలంగా కుటుంబాల్లో కలహాలు మొదలై బంధాలు విచ్ఛిన్నమవుతాయని, ముఖ్యంగా మహిళల పైన దాడులు హింస పెరిగే అవకాశం ఉందని విద్యార్థులు, యువత ఆరోగ్యాలు నాశనం అవుతాయని వారి ఉజ్వల భవిష్యత్తు విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సింది పోయి, తాగుబోతులుగా చేయాలనుకోవడం విడ్డూరంగా ఉందని, మద్యం దుకాణాలు వద్దు ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మహిళలకు భద్రత కల్పించాలని మా ఊరి లో నువ్వు మధ్యమనే మాయా లోకంలోకి లాగొద్దని విజ్ఞప్తి చేసారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మద్యం పాలసీ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున మహిళలను సేకరించి ఆందోళనలకు సిద్ధమవుతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.