మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:3 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: మాల మహానాడు జాతీయ కార్యదర్శి కాసర్ల యాదగిరి మాట్లాడుతూ జూలై 29 న కృష్ణాకాలనీ లోని శాంతి మైదానంలో నీరటి సురేష్ ను పిలిచి అక్బర్, సంతోష్, అంగడి రాజేష్,దండు కిరణ్ లు పది మందితో కలిసి రక్తం వొచ్చేలా కొట్టడం నేరమని, సురేష్ కు రైల్వే ఉద్యోగం ఇపిస్తానని మోసపూరితంగా తీసుకొన్న 6 లక్షలు తిరిగి ఇస్తామని పిలిచి దాడి చేశారని, అంతే కాకుండా, కులం పేరుతో అనరాని బూతులు తిట్టారని తెలిపారు.
సురేష్ పై దాటి చేసిన వారిని వెంటనె అరెస్ట్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధితునికి న్యాయం జరిగేలా చూస్తామని, బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కె.మలేష్, ఎన్.చంద్రయ్య, కళ, స్పందన, శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
