మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తాండూరు మండలం
తేదీ:1 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మంచిర్యాల జిల్లా, తాండూర్ మండల సిపిఐ కౌన్సిల్ సమావేశం శుక్రవారం భగత్ సింగ్ భవన్ లో నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ కౌన్సిల్ సమావేశంలో నూతన మండల కమిటీని జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు బయ్యమొగిలి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.
కార్యదర్శిగా కొండు బానేష్, సహాయ కార్యదర్శులుగా నరాల ప్రహ్లాద్, మలిశెట్టి సత్యనారాయణ,ఆర్గనైజింగ్ సెక్రెటరీగా వాసాల నాగరాజు, కోశాధికారిగా పట్టి శంకర్,ను
ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, సిపిఐ జిల్లా సమితి సభ్యులు సాలిగామ సంతోష్, ఇందారపు రాజేష్, ఎడ్ల గోపాల్, దాసరి లక్ష్మి, కామెరా దుర్గయ్య, కొండ సాయికుమార్, మెట్టుపల్లి ధర్మయ్య, భోగి కృష్ణ, ఎలిగేటి భీమేష్, మీసాల సన్యాసి, కొడిప్యాక భాస్కర్, కరబోయిన కళ తదితరులు పాల్గొన్నారు.
