మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 01 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే,
రాజీవ్ నగర్ లో ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనంతరం పాత మంచిర్యాలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
దొరికిన సమయాన్ని వృధా చేయకుండా జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తుండడంతో ఎప్పుడు ఏ శాఖ కార్యాలయానికి తనిఖీ చేస్తారో అని అధికారులు ఆందోళనలు చేస్తున్నట్టు సమాచారం. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రభుత్వ ఆసుపత్రులలో స్వచ్ఛత పాటిస్తూ, మెరుగైన వైద్య ము లభించడంతో పాటు ప్రభుత్వ హాస్టళ్లలో నయమైన భోజనం అందిస్తున్నట్టు విద్యార్థుల తల్లి తండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
