భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు మండలం
✍️దుర్గా ప్రసాద్
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రాజీవ్ గాంధీ నగర్ లో అభివృద్ధి కుంటుపడిపోతుంది. ఎందుకని ప్రశ్నిస్తున్నాం…? అల్లెం కోటి, తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
వ్యవసాయ మార్కెట్ యార్డుకు కోట్లాది రూ/- వచ్చి ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తున్నా అది ప్రారంభం కాలేదు, పనులు నిలిచిపోయి ఉన్నాయి.
ఈ యొక్క మార్కెట్ యార్డులో నిర్మించిన షాప్ లు వాటిని ప్రారంభిస్తే మణుగూరులో ఉన్నటువంటి కూరగాయల దుఖానాలు, మటన్, చికెన్, ఫిష్ అన్ని ఇక్కడికి వస్తాయి, సన్నకారు, చిన్నకారు దుకాణదారులకి న్యాయం జరుగుతుంది.
ఎక్సైజ్ ఆఫీస్ కోసం లక్షలాది రూ/- ఖర్చు పెట్టారు, అది ఈ రోజు పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది. మరి నిధులు ఎందుకు పెండిగ్ పడుతున్నాయి. ఎందుకు పూర్తి చేయడం లేదు అని ప్రశ్నిస్తున్నం.? ఎన్నో సంవత్సరాల నుండి అంగన్ వాడి కి సొంత భవనం లేక కిరాయికి ఉంటూ ఆ బజారు ఈ బజారుకి మారుస్తూ ప్రజలకి అంగాన్ వాడి ఎక్కడ ఉంటుందో కూడా తెలియడం లేదు.
ఈ ప్రాంతం మొత్తం కూడా సర్వే నం. 138 ప్రభుత్వ భూమి, ప్రభుత్వ అధికారులకి భూమి దొరకడం లేదా…? రెవిన్యూ రికార్డు పరంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ భూమి చూపించాలా…? ప్రధాన రొడ్డుని తారు రొడ్డుగా చెయ్యాలని నిధులు శాంక్షన్ చేస్తే ఈ రోడ్డు ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రజలు దుమ్ముతో , ధూళితో ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు.
అలాగే ఆ యొక్క రోడ్డుకి రెండు పక్కల సైడ్ డ్రైనేజీ లేక వాటర్ మొత్తం రోడ్డు పైకి వచ్చి స్కూల్ పిల్లలు, మహిళలు, ప్రజలు మొత్తం ఇబ్బంది పడుతున్నారు. పైన పేర్కొన్న సమస్యలపై వెంటనే సంబంధిత అధికారులు మరియు స్థానిక MLA పాయం వెంకటేశ్వర్లు గారు స్పందించలని లేనియెడల ఉద్యమం చేస్తామని రాబోవు స్థానిక ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని విజ్ఞప్తి చేశారు
