మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:3 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: ఆదివారం బెల్లంపల్లి హమాలీ సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గ హమాలీ సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ముఖ్య అతిథులుగా తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జీ. సామ్రాజ్యం,ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యులు ఎస్.మోహన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
అడ్డా కూలీలను కూడా ప్రభుత్వం గుర్తించింది. కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న హమాలీలను మాత్రం గుర్తించడం లేదని అన్నారు.హమాలీ సభ్యుల కోసం ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేయాలన్నారు. హమాలీ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హమాలీ పీస్ వైస్ రేట్, కామన్ రేట్,ఐడీ కార్డు ఉపాధి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
వీలైనంత త్వరలో పోరాటాల గడ్డ బెల్లంపల్లి పట్టణంలో ఉమ్మడి ఆదిలాబాద్ హమాలీ సంఘాలను ఏక దాటిపై తీసుకొచ్చేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని,బారి సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. త్వరలో తేదీని ప్రకటిస్తామని చెప్పారు. హమాలీలకు అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు, ఉద్యమ నేతలు మద్దతు తెలుపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి హమాలీ సంఘం అధ్యక్షుడు గెల్లి రాజలింగు, నాయకులు ఏం.చంద్రయ్య,పెద్ద హమాలీ ముకద్దం కే.సమ్మయ్య, జెట్టి రాజ్ కుమార్, గణేష్, చిన్న హమలీ ముకద్దం సంపత్, గొలగట్టు రాజయ్య, యాటకారి వెంకటేష్, ఐబీ హమాలీ సంఘం సీహెచ్.లక్ష్మణ్, నెన్నెల జంగితి కైలాష్ యాదవ్, బండి రాకేష్, రాజు, దేహేగామ దుండ్ర రమేష్, మైలారం, కన్నెపల్లి, పెంచికల్ పేట, భీమిని హమాలీ సంఘం హమాలీ వర్కర్స్ పాల్గొన్నారు.
