HCL టెక్ ఆధ్వర్యంలో 2023-24,2024-25 విద్యా సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులకు రేపు జాబ్ మేళా నిర్వహించనున్నారు.

సాఫ్ట్ వేర్ రంగంలో ఐటీ, డీపీవో ఉద్యోగాల్లో అవకాశం కల్పించేందుకు రేపు ఖమ్మం నయాబజార్ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు DIEO కె.రవిబాబు తెలిపారు.

75 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని, ఆసక్తి ఉన్నవారు హాజరుకావాలన్నారు.