మంచిర్యాల జిల్లా,
తాండూరు,
తేదీ:1 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి నియోజకవర్గంలో తాండూర్ మండల కేంద్రంలో ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా తాండూర్ మండల్ ఆటో యూనియన్ అధ్యక్షులు మామహమ్మద్ హబీబ్ పాషా ఆధ్వర్యంలో ఐబి చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి కార్యక్రమం జరుపుకున్నారని ఐబీ తాండూర్ ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు హబీబ్ భాషా తెలియజేసారు.
ఈ సందర్భంగా తాండూర్ ఆటో యూనియన్ మండల కోశాధికారి పోరగండి సుధాకర్ మాట్లాడుతూ…
ఈరోజు ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం జరుపుకోలేని దయనీయ పరిస్థితిలో ఉన్న ఆటో డ్రైవర్ల ఐక్యతను చాటుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితిలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామని అన్నారు. తాండూరు మండల జనరల్ సెక్రెటరీ కొత్త శంకర్ మాట్లాడుతూ మా తాండూరు మండల ఆటో కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చిన ఇప్పటివరకు ఆటో యూనియన్ తరపున సహాయ సహకారాలు అందిస్తూ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని, ఇక ముందు కూడా అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగాలని సందేశాన్ని ఇచ్చారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షులు మహమ్మద్ హబీబ్ పాషా మాట్లాడుతూ…
తాండూరు మండలంలోని ప్రతి ఆటో కార్మికులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలన్నారు. మనం ఎంచుకున్న ఆటో డ్రైవర్ వృత్తిలో అనునిత్యం ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని గ్రహించి మద్యం సేవించి ఆటోలు నడపరాదని మన వెనుక మన కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మనకేదైనా ప్రమాదం జరిగితే మన కుటుంబం ఇబ్బందుల పాలవుతుందనే విషయాన్ని గుర్తు చేశారు. ఈరోజు ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ వేదికగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి మేము వ్యతిరేకం కాదని ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికే 87 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారని ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో కార్మికులకు 2023 ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు సంక్షేమ కూడా ఏర్పాటు చేస్తామని సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసి, ఇప్పటివరకు వాటి ఊసు కూడా ఎత్తడం లేదని అన్నారు.
ఇప్పటికైనా రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ఆటో డ్రైవర్ల కోసం చర్చించి వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఆటో వాళ్లకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చంద్ ఖాన్ ,ప్రధాన కార్యదర్శి కొత్త శంకర్, కోశాధికారి ఓరగంటి సుధాకర్, సలహాదారులు విద్యాసాగర్, తోటి ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
