భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్

ఈరోజు స్థానిక పాండు రంగా పురం సెంటర్ నందు నూతన విధ్యుత్ కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు రిటైర్డ్ ఫోర్ మెన్ శ్రీ జమ్ముల సీతారామరెడ్డి గారి అధ్యక్షతన జరిగింది.

ఈ అవగాహనా సదస్సులో వక్తలు చైర్మన్ శ్రీ జమ్ముల సీతారాం రెడ్డి కన్వినర్ శ్రీ మంగీలాల్ గారు మాట్లాడుతూ…

పాల్వంచలో నూతనంగా ఎన్ని పవర్ ప్లాంట్ లు కట్టిన ఇబ్బంది ఏమి లేదని, ప్రభుత్వానికి కూడా పెద్ద భారమేమి కాదని, పాల్వంచకు కూతవేటు దూరంలో కిన్నెరసాని ప్రాజెక్టు ఉందని, పాల్వంచ చుట్టు కొత్తగూడెం, కోయగూడెం, మణుగూరు, ఇల్లందు ఇలా సింగరేణి బొగ్గు అందుబాటులో ఉంది కావున మూసివేసిన పాత ప్లాంట్ స్థానంలో మరో ప్లాంట్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే రాష్ట్రానికి ఉత్తమ విద్యుత్ కేంద్రంగా పేరు పెరుగావించిన పాల్వంచ కేటీపీఎస్ పాత ప్లాంట్ మూసివేసిన తర్వాత మెల్లి మెల్లిగా పాల్వంచ యొక్క వైభవం తగ్గుముఖం పట్టింది, తిరిగి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే కచ్చితంగా ఆ స్థానంలో 2×800 మెగా విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశమునకు 1104, 327,1535, TRVKS, CITU. AITUC, H 142’BMS, H-82 ట్రేడ్ నాయకులు, BC,ST, SC అసోసియేషన్ నాయకులు, డిప్లొమా ఇంజనీర్స్ AE అసోసియేషన్, అకౌంట్స్ సెక్షన్ నాయకులు, కార్మికులు ఉద్యోగులు ఆర్థిసన్స్ పాల్గొన్నారు.