మంచిర్యాల జిల్లా,
మందమర్రి,
తేది: 05 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో గల మందమర్రి సెకండ్ జోన్ లో పుట్టింటి నుండి భార్య తిరిగి రావడం లేదని మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి.
వివరాల్లోకి వెళ్ళితే…
శనిగారపు కార్తీక్ కు హన్మకొండ కు చెందిన లాస్య తో 2018 లో వివాహం జరిగింది. ప్రస్తుతం వారికి ఒక బాబు,ఒక పాప గత నెల రోజుల క్రితం ఇరువురి మధ్య గొడవ జరిగిందని, దీంతో అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో మనస్థాపానికి గురి అయిన తన తమ్ముడు కార్తీక్ సోమవారం మధ్యాహ్నం సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని అన్న సాగర్ పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్ఐ మాజిద్ ఖాన్ తెలిపారు.
