మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:5 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో బీఎస్ఎన్ఎల్ ఔట్ లెట్ ఆటో స్టోర్ ఏర్పాటుపై బీఎస్ఎన్ఎల్ డివిజన్ ఇంజనీర్ కు లేఖ అందించినట్టు మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధి కొలిపాక శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మన భారతదేశం లో సమాచార సాధనలో కీలక పాత్ర పోషించిన బీఎస్ఎన్ఎల్ సంస్థ గత పది ఏళ్ల నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది.ప్రగతి లేక సంస్థ ఉద్యోగస్తులను ఇంటికి పంపిన విషయంపై దేశం లోని మేధావులు, రాజకీయ నేతల వొత్తిడి పై ఆగష్టు 15 సందర్బంగా అజాది కా అమృతోత్సవ్ పై బీఎస్ఎన్ఎల్ ఒక రూపాయికే సిమ్ ఉచితముగా ఇస్తూ ఒక నెల అన్ లిమిటెడ్ కాల్స్ ఇవ్వడం సంతోషం. బెల్లంపల్లి బజార్ ఏరియా లో బీఎస్ఎన్ఎల్ అవుట్ లెట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలని కోరారు. మంగళవారం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం లో డివిజన్ ఇంజనీర్ ప్రకాష్ కు వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు.
