భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
పాల్వంచకు చెందిన ప్రముఖ సౌండ్ అండ్ డెకరేటర్స్ అధినేత నంది వీరభద్ర రావు అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధి 5 వ వార్డు గాంధీనగర్ లోని ఆయన స్వగృహంలోని భౌతిక కాయానికి రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు తో పాటు కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.
కేటీపీఎస్ ఫోర్ మెన్ రామ్ లీలా ప్రసాద్ దశదినకర్మల్లో పాల్గొన్న కొత్వాల
కేటీపీఎస్ గ్రేడ్ వన్ ఫోర్ మెన్ రామ్ లీలా ప్రసాద్ ఇటీవల మరణించారు.
సోమవారం ఆయన దశదిన కర్మ సందర్భంగా రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ఎర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న,కాంగ్రెస్ నాయకులు SVRK ఆచార్యులు,కొత్తపల్లి సోమయ్య, కందుకూరి రాము,కాటుకూరి శేఖర్ కత్తి శ్రీను, కొమ్మరపు ఆదమ్, సీతారాములు, ప్రసాద్ కుటుంబసభ్యులు,వీరభద్రం సార్, నందిగామ జయరాజు, కేసుపాక లక్ష్మీ, కోట వెంకటేశ్వర్లు, నంది శివ, నంది జగదీష్, అన్వర్, బాబా యూసుబ్ తదితరులు పాల్గొన్నారు.
